'నేడే ఫలితాలు.. అభ్యర్థుల గుండెల్లో గుబులు'

'నేడే ఫలితాలు.. అభ్యర్థుల గుండెల్లో గుబులు'

MHBD: తొర్రూరు మున్సిపాలిటీలో నెలకొన్న ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. ఓటర్ దేవుడు ఎవరికి పట్టం కట్టాడు...? ఎవరిని ఇంటికి పంపాడు..? అనేది నేడు తేలిపోనుంది. గెలుపుపై ధీమా ఉన్నా.. లోలోపల ఏదో తెలియని గుబులు అభ్యర్థులను వెంటాడుతుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరి పోరు సాగడంతో ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.