'ఎమ్మెల్యే మురళి నాయక్ రాజీనామా చేయాలి'

MHBD: కేసముద్రం మండలం కాట్రపల్లిలో రోడ్లు బురదమయంగా మారాయని, గ్రామ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న MLA మురళి నాయక్ రాజీనామా చేయాలని MCPI (యు) నేత గడ్డం నాగార్జున ఇవాళ డిమాండ్ చేశారు. అక్రమ క్వారీ లారీలతో రోడ్లు దెబ్బతిన్నాయని, కాంగ్రెస్ అంతర్గత పోరుతో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. రోడ్లు వేయకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.