ZP హైస్కూల్‌లో Monsoon Hygiene కార్యక్రమం

అన్నమయ్య: చిట్వేల్ ZP హైస్కూల్‌లో ''Monsoon Hygiene'' కార్యక్రమం జరిగింది. ప్రధానోపాధ్యాయుడు దుర్గరాజు వర్షాకాలంలో దోమల వల్ల వ్యాధులు వ్యాప్తి చెందుతాయని తెలిపారు. ఉపాధ్యాయులు పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలని సూచించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు చెత్త తొలగించి ర్యాలీ నిర్వహించారు. చివరగా ప్రతిజ్ఞ చేశారు.