వర్షం బీభత్సం.. కూలిన బీరకాయ పందిరి

వర్షం బీభత్సం.. కూలిన బీరకాయ పందిరి

VKB: కులకచర్లలోనీ రాంనగర్లో 3 రోజుల క్రితం వర్షం, ఈదురు గాలులతో బీరకాయ పందిరి కూలిపోయి రైతులకు అపార నష్టం వాటిల్లింది. ముఖ్యంగా కోత దశలో ఉన్న పందిరి కూరగాయలు నేలపాలయ్యాయి. కష్టపడి పెంచిన పంట కళ్లముందే నాశనం కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం నష్టపోయిన పంటలను సర్వే చేసి, పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.