VIDEO: ఘనంగా వాడపల్లి వెంకన్న నిత్య కళ్యాణం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు ఆదివారం స్వామివారి నిత్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో రద్దీ నెలకొంది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం చేసుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో చక్రధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.