'పంచనామా చేయించి, అందజేయాలి'

'పంచనామా చేయించి, అందజేయాలి'

ASR: పాడేరు మండలం గడ్డివలస, బరిసింగి, మండిపుట్టు, డేగలవీధి తదితర గ్రామాల్లో శుక్రవారం ఏడీ డాక్టర్ పీ.వేణుమాధవ్‌తో కలిసి జిల్లా పశుసంవర్థక అధికారి డాక్టర్ వీ.జయరాజు పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పశువైద్య శిబిరాలను తనిఖీ చేశారు. తుఫాను కారణంగా మృత్యువాత పడిన పశువుల వివరాలను సర్పంచ్, కార్యదర్శితో పంచనామా చేయించి, తమకు అందించాలన్నారు.