జిల్లా టమాటా రైతుల కన్నీళ్లు
అన్నమయ్య: మదనపల్లె ప్రాంతంలో టమాటా రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కిలో ధర రూ.3-6కి పడిపోవడంతో పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి ఏర్పడింది. రోజుకు వందల టన్నుల టమాటా ఎగుమతి అవుతున్నప్పటికీ, ఇతర రాష్ట్రాల నుంచి అధిక సరఫరా రావడం వల్ల డిమాండ్ తగ్గిపోయింది. కూలీ, రవాణా ఖర్చులు కూడా రాక పంటను తోటల్లోనే వదిలేస్తున్నట్లు అన్నదాతలు వాపోతున్నారు.