గణేష్ నగర్‌లో పొంగి పొర్లుతున్న డ్రైనేజీ

గణేష్ నగర్‌లో పొంగి పొర్లుతున్న డ్రైనేజీ

MDCL: ఉప్పల్ గణేష్ నగర్‌లో డ్రైనేజీ సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. కాలువలు పొంగిపొర్లుతూ రోడ్లపైకి చేరి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. దుర్వాసనతో పాటు దోమల పెరుగుదల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది. పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారుల స్పందన లేకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.