విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: రజిని

విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: రజిని

WNP: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని అన్నారు. నవంబర్ 14న జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా బుధవారం కొత్తకోటలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం అంశాలపై వివరించారు.