అర్థవీడులో పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
ప్రకాశం: అర్ధవీడులోని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు సోమవారం పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున పరీక్షా కేంద్రాల వద్ద ఎవరు గుంపులుగా ఉండరాదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.