దేవ్‌జీ, రాజిరెడ్డిల గురించి ఆధారాలు లేవు: హైకోర్టు
AP: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సీనియర్ సభ్యులు దేవ్‌జీ, రాజిరెడ్డిలు పోలీసుల అదుపులో ఉన్నారనేందుకు ప్రాథమిక ఆధారాలు లేవని హైకోర్టు తెలిపింది. ఆధారాలు లభిస్తే కోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది. కాగా, ఈనెల 18న మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగిన క్రమంలో దేవ్‌జీ, రాజిరెడ్డిను అరెస్ట్ చేసినట్లు సమాచారం.