సూర్యాపేటలో అయ్యప్ప మాలదారుల ఆందోళన

సూర్యాపేటలో అయ్యప్ప మాలదారుల ఆందోళన

సూర్యాపేటలోని AVM స్కూల్ ముందు అయ్యప్ప మాల దారులు ఆందోళన చేపట్టారు. అయ్యప్ప మాలో ఉన్న విద్యార్థులను స్కూల్ యాజమాన్యం తరగతిలోకి అనుమతించకపోవడంతో, విద్యార్థుల పేరెంట్స్, అయ్యప్ప మాల దారులు స్కూల్ ముందు ధర్నా చేశారు. అయ్యప్ప మాలను అవహేళన చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ ఇదే తరహా సంఘటనలు జరిగాయని ఆరోపించారు.