పిఠాపురంలో క్షుద్ర పూజల కలకలం.!
KKD: పిఠాపురంలోని అగ్రహారం ప్రాంతంలో క్షుద్ర పూజలు తీవ్ర కలకలం సృష్టించాయి. శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇక్కడ క్షుద్ర పూజలు నిర్వహించినట్లు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయని స్థానికులు తెలిపారు. ముగ్గు పిండితో వేసిన బొమ్మలు, కుంకుమ, ఎండుమిరపకాయలు, నిమ్మకాయలు పడి ఉండటంతో అగ్రహారవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.