BLOలకు గుర్తింపు కార్డులు పంపిణీ

BLOలకు గుర్తింపు కార్డులు పంపిణీ

KKD: ఎన్నికల సంఘం నిర్దేశించిన విధులను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సామర్లకోట మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య కోరారు. శుక్రవారం ఆమె 37 మంది బూత్ స్థాయి అధికారులకు (BLOలకు) రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. BLOలు తమ పరిధిలోని పనులు, బాధ్యతలను ఈసీ ఆదేశాల మేరకు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆమె సూచించారు.