ఆర్టీసీ కార్మికుల సమ్మె.. విద్యార్థుల ఆందోళన
HYD: ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె బాట పట్టారు. దీంతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే డబ్బు చెల్లించి బస్సు పాస్‌లు తీసుకున్నారు. మళ్లీ ప్రైవేట్ వాహనాలకు డబ్బులు చెల్లించాలంటే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన చెందుతున్నారు