మన్యం జిల్లాలో క్రీడాకారుల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమం

మన్యం జిల్లాలో క్రీడాకారుల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమం

PPM: మన్యం జిల్లాలోని పాఠశాల, కళాశాల స్థాయిలో గల క్రీడాకారులను, ప్రతిభావంతులను గుర్తించి, వారికి పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చి ప్రోత్సహించేలా ఒక ప్రత్యేక క్రీడా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది పేర్కొన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ ప్రకటించారు.