జూద శిబిరంపై దాడి

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం కురాడ వద్ద శుక్రవారం జూద శిబిరంపై దాడి జరిగింది. ఎస్సై N.V.V సత్యనారాయణ సిబ్బందితో కలిసి కొబ్బరి తోటల్లో రహస్యంగా జూదం ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.15,000 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.