నేత్రదాత కుటుంబానికి అభినందన పత్రం అందజేత

PDL: గోదావరిఖని లక్ష్మీనగర్‌కు చెందిన కాసర్ల అమృతమ్మ ఇటీవల మృతి చెందగా కుటుంబ సభ్యుల అంగీకారంతో సదాశయ ఫౌండేషన్ ద్వారా నేత్రదానం చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమె ఇంటిలో సంస్మరణ సభ ఏర్పాటు చేసి, అభినందన పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు లింగమూర్తి, వాసు, ప్రకాష్ రెడ్డి, చంద్రశేఖర్, డాక్టర్ లక్ష్మీవాణి తదితరులు ఉన్నారు.