నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొమ్ము జోహార్

నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొమ్ము జోహార్

సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన కొమ్ము జోహార్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బుధవారం నియామకమయ్యారు. ఈ సందర్భంగా జోహార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేశానని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.