VIDEO: మానసా దేవి ఆలయంలో భక్తుల రద్దీ
KNR: గన్నేరువరం మండలం ఖాసీంపేట గ్రామంలో స్వయంభుగా వెలసిన మానసా దేవి ఆలయంలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయంలో 108 శివలింగాలకు క్షీరాభిషేకం, మానసా దేవి అమ్మవారికి క్షీరాభిషేకం, ఆలయంలో కుంకుమ పూజలు, భక్తులు కార్తిక దీపాలను వెలిగిస్తూ భక్తిశ్రద్ధలతో అమ్మవారిని వేడుకున్నారు. ముడుపులు కట్టి ఒడి బియ్యం పోసి అమ్మవారిని చల్లగా చూడాలని మొక్కుకున్నారు.