పాఠశాల గోడ కూలి విద్యార్థి మృతి

KRNL: పాతబస్తీలో ఉన్న కీర్తి పాఠశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పాఠశాలలో ప్రమాదావశాత్తు తరగతి గది గోడ కూలి విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనలో మరికొందరు విద్యార్థులు గాయపడ్డారు. వెంటనే స్పందించిన పాఠశాల యాజమాన్యం గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఒక విద్యార్థి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో బస్తీలో విషాదఛాయలు అలుముకున్నాయి.