ఆటో డ్రైవర్ల సమస్యలపై సీఐటీయూ సమావేశం
KRNL: ఎమ్మిగనూరులో సీఐటీయూ కార్యాలయంలో ఇవాళ ఆటో డ్రైవర్ల కార్యవర్గ సమావేశం ఎస్. షబ్బీర్ అధ్యక్షతన నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగ కార్మికుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని నాయకులు ప్రభాకర్, గోవిందు, రాముడు విమర్శించారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, జీవో నంబర్ 21 రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.