VIDEO: నీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్థులు
ADB: నార్నూర్ మండలంలోని గుంజాల సమతానగర్ గ్రామస్థులు గురువారం ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. గత 10 రోజుల నుంచి మిషన్ భగీరథ నీరు అందక తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నామని వారు వాపోయారు. వేసవి కాలం ప్రారంభమైనప్పటికీ అధికారులు తాగు నీటి కష్టాలు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి నీటిని సరఫరా చేయాలనీ డిమాండ్ చేశారు.