ఆ వెబ్‌సైట్ ఫేక్.. కేంద్రం హెచ్చరిక
సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేసి డబ్బులు కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ వెబ్‌సైట్‌ల విషయంలో కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. సమగ్ర శిక్షా అభియాన్ అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండేలా http://sarvashikshaabhiyan.com అనే వెబ్‌సైట్ రూపొందించారని తెలిపింది. ఈ నకిలీ వెబ్‌సైట్‌తో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది.