అక్రమంగా నిర్మిస్తున్న రైస్ మిల్లును ఆపివేయాలని వినతి

అక్రమంగా నిర్మిస్తున్న రైస్ మిల్లును ఆపివేయాలని వినతి

కామారెడ్డి: జిల్లాలోని గాంధారి మండలం జువ్వాడిలో సర్వే నంబర్ 100లో నిర్మిస్తున్న రైస్ మిల్లును ఆపివేయాలని గ్రామస్తులు శనివారం ఎమ్మార్వో రేణుక చౌహన్‌కు వినతి పత్రం అందజేశారు. అక్రమంగా నిర్మిస్తున్న రైస్ మిల్ యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.