అర్జీలను స్వీకరించిన కలెక్టర్
W.G: భీమవరం కలెక్టరేట్‌లోని PGRS హల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీలను స్వీకరించారు. సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.