ఆర్టీసీ బస్టాండ్‌లో ఫుట్పాత్ ఏర్పాటుకు చర్యలు

CTR: ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రజలు నడవడానికి వీలుగా ఫుట్పాత్ ఏర్పాటుకు గురువారం అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర భూమి పూజను నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపున ఉన్న ఆక్రమణలను తొలగించారు. ఫుట్పాత్ ఏర్పాటు చేసిన అనంతరం ప్రజలు ఫుట్పాత్ పైనే నడవాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపడుతున్న కారణంగా ప్రజలు నగర అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.