'ఉద్యమకారులకు న్యాయం చేయాలి'
MDK: రామాయంపేట మండలానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు దేవేందర్ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు ఇళ్లు, స్థలాలు కేటాయించి పెన్షన్లు ఇవ్వాలని ఇవాళ కోరారు. అలాగే హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరారు.