కేంద్ర రైల్వే శాఖ మంత్రికి స్వాగతం పలికిన పరిటాల సునీత

ATP: పట్టణంలోని తమ నివాసానికి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న శుక్రవారం వచ్చారు. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆయనకు గౌరవపూర్వకంగా స్వాగతం తెలిపారు. పలు అభివృద్ధి అంశాలపై సోమన్నతో ప్రత్యేకంగా చర్చించారు. అనంతరం ఆయనకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.