VIDEO: 'బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించిన వీరుడు అల్లూరి'

NLR: అల్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో బుధవారం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని ఎంపీడీఓ రజనీకాంత్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శశిరేఖ, టీడీపీ నేత గిరిధర్ పాల్గొన్నారు.