వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ వైర్ల చోరీ

వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ వైర్ల చోరీ

VKB: పెద్దముల్ మండలం మంబాపూర్ గ్రామంలో పొలాల వద్ద బోర్ మోటార్ల కింద వరి సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రివేళ ఈ మోటార్ల విద్యుత్ వైర్లను గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. ఇది గమనించిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, జిల్లాలో ఈ ఘటనలు తరచూ జరగడం రైతులను బెంబేలిస్తుంది.