ఘనంగా సత్యమ్మ తల్లి జాతర..!
NTR: నందిగామ మండలంలోని అంబారుపేట సత్యమ్మ తల్లి చైత్రమాస జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ 3,500 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ మంచాల మాధవ్, ఈవో సీతారావమ్మ, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.