ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
PDPL: సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి, భూపతిపూర్, సాంబయ్య పల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మినుపాల ప్రకాశ్ రావు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ జానీ, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు పడాల అజయ్ గౌడ్, మాజీ సర్పంచులు సత్యనారాయణరావు, రమేశ్ పాల్గొన్నారు.