అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కృష్ణా: పెనమలూరు మండలం తాడిగడప గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో శనివారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడాదిలో రూ. 9000 కోట్ల నగదును రైతుల ఖాతాల్లోకి జమ చేయడం కూటమి ప్రభుత్వానికి గర్వకారణమన్నారు.