మల్లమ్మ గుంటలో 200 కరెంటు స్తంభాలు ఏర్పాటు

మల్లమ్మ గుంటలో 200 కరెంటు స్తంభాలు ఏర్పాటు

NLR: రాపూరు మేజర్ పంచాయతీ పరిధిలోని మల్లమ్మ గుంట గ్రామంలో మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై స్పందించిన స్థానిక నాయకులు మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేశారు. 200కు పైగా కొత్త కరెంటు స్తంభాలను ఏర్పాటు చేసి రోడ్ల మరమ్మత్తులు చేపట్టారు. 4బోరు బావులకు మరమ్మతులు చేయించి నీటి సమస్యను పరిష్కరించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.