ఖమ్మం డీఈవోగా చైతన్య జైనీ బదిలీ
KNR: ఖమ్మం జిల్లా నూతన విద్యాశాఖాధికారి (డీఈవో)గా కరీంనగర్ డీఈవో చైతన్య జైనీ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కరీంనగర్ డీఈవోగా బాధ్యతలు చేపట్టిన చైతన్య జైనీ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. కాగా, కరీంనగర్ డీఈవోగా డైట్ ప్రిన్సిపాల్ శ్రీరామ్ మొండయ్య కొనసాగనున్నారు.