'చేనేతలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి'
కడప: కూటమి ప్రభుత్వం చేనేతలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చేనేత ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున డిమాండ్ చేశారు. శనివారం తన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చేనేతలకు అనేక హామీలు ఇచ్చిందని, 18 నెలల కాలం గడుస్తున్నా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. హామీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.