విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు

WGL: పర్వతగిరి మండలం ఏబీ తండా శివారు బోటికాడి తండాలో స్విచ్ వేయకుండానే లైట్లు, ఫ్యాన్లు పనిచేస్తాయని ఇవాళ హిట్ టివి కథనం రావడంతో విద్యుత్ అధికారులు స్పందించారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు ఎర్తింగ్ వైర్‌ను ఏర్పాటు చేశారు. మళ్లీ సమస్య పునర్వతం కాకుండా విద్యుత్ సమస్యను అధికారులు పరిష్కరించారు. సమస్య పరిష్కారం కావడంతో తండావాసులు హర్షం వ్యక్తంచేశారు.