చిరుత మృతిపై పవన్ కీలక ఆదేశాలు

చిరుత మృతిపై పవన్ కీలక ఆదేశాలు

అన్నమయ్య: వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత మృతిచెందింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా పొన్నూటిపాళెం సమీపంలో చోటుచేసుకుంది. ఆ చిరుత కడుపులో రెండు పిల్లలు కూడా చనిపోవడంపై విమర్శలు వచ్చాయి. చిరుత మృతి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. పీసీసీఎఫ్ చలపతిరావుని విచారణ అధికారిగా నియమించారు.