'హిమోఫిలియా బాధితులకు అండగా నిలవాలి'

'హిమోఫిలియా బాధితులకు అండగా నిలవాలి'

ATP: ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం సందర్భంగా అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. సూపరింటెండెంట్ డా.మళ్లీశ్వరి మాట్లాడుతూ.. బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపాలని పిలుపునిచ్చారు. రక్తం గడ్డకట్టకపోవడం వల్ల కలిగే ఇబ్బందులను వివరించారు. RMO డా.హేమలత మాట్లాడుతూ.. ఇది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి అని స్పష్టం చేశారు.