మద్యం మత్తులో భార్యను కడతేర్చిన భర్త

కడప: పెండ్లిమర్రి మండలం గంగనపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో భార్యను కడతేర్చిన ఘటన గ్రామంలో ఆదివారం కలకలం రేపింది. సుబ్బరాయుడు తన భార్య లూర్డ్ మేరీని మద్యం మత్తులో విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్నపెండ్లిమర్రి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.