అలుగు పైనుంచి పారుతున్న చెరువు

MBNR: బాలానగర్ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి మండల కేంద్రంలోని చిన్న చెరువు, పెద్ద చెరువు అలుగులు దూకుతున్నాయి. నీటి ఉద్ధృతి పెరిగితే మరింత అలుగు ప్రవహించే అవకాశం ఉందని మండల కేంద్రం ప్రజలు అన్నారు. అలుగు పారిన వరద నీరు దుందుభి నదిలో కలవనుంది.