VIDEO: అష్టమి ప్రభావం నామినేషన్ల ప్రక్రియ మందగింపు
NLG: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా చండూరు, డివిజన్ పరిధిలోని నాంపల్లి, చండూరు, మనుగోడు, మర్రిగూడ మండల గ్రామాల్లో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ మందకొడిగా సాగింది. ఇవాళ అష్టమి తిథి ఉండటం వల్ల మంచి ముహూర్తం కాదని అభ్యర్థులు భావించారు. ఈ కారణంగా, నామినేషన్ల సెంటర్లు బోసిపోయాయి.