నమీబియా జట్టుకు గ్యారీ కిర్‌స్టన్ సేవలు

నమీబియా జట్టుకు గ్యారీ కిర్‌స్టన్ సేవలు

2026 T20 ప్రపంచకప్‌లో మొత్తం 20 దేశాలు పాల్గొంటున్నాయి. ఈ టోర్నమెంట్‌కు నమీబియా జట్టు కూడా సంచలన విజయాలతో అర్హత సాధించింది. గతంలో కూడా 2021, 2022, 2024 ప్రపంచకప్‌లలో పాల్గొన్న నమీబియా, ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే దిగ్గజ కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌ను తమ 'కన్సల్టెంట్‌గా' నియమించుకుంది.