పరువు హత్య.. తండ్రి, మేనమామ అరెస్ట్

పరువు హత్య.. తండ్రి, మేనమామ అరెస్ట్

PLD: మాచర్లలో చౌడేశ్వరి పరువు హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఆమె తండ్రి చంద్రశ్రీను, మేనమామ శ్రీనులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ వివాహం చేసుకున్న చౌడేశ్వరి, ఆత్మహత్య చేసుకుందని తండ్రి నమ్మించే ప్రయత్నం చేయగా.. విచారణలో హత్యగా తేలింది. నిందులకు వైద్య పరీక్షలు నిర్వహించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కాగా, దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.