రక్తదానం చేసిన న్యాయవాది

నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుడు, కేంద్ర ప్రభుత్వ న్యాయవాది దాసరి రాజేంద్రప్రసాద్ 54వ సారి మంగళవారం రక్తదానం చేశారు. ప్రజలకు ఆయన రక్తదానంపై అవగాహన కల్పించారు. 54వ సారి ఆయన రక్తదానం చేయడంతో పాటు తనతో పాటు మరో నలుగురి చేత రక్తదానం చేయించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మేనేజర్ మస్తానయ్య, చింతగుంట శ్రీనివాసులు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.