పాతబస్తీలో వ్యక్తి కిడ్నాప్

HYD: పాతబస్తీలో షేక్ పాషా అనే వ్యక్తి కిడ్నాప్‌కు గురయ్యాడు. అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో గౌస్ నగర్‌లో షేక్ అమీర్ గ్యాంగ్ అతడిని ఆటోలో కిడ్నాప్ చేసి, రూ. 2,000 కోసం డిమాండ్ చేసిందని, కత్తులు, బ్లేడ్ లతో హత్య చేస్తామంటూ బెదిరించారని తెలిపాడు. బాధితుడు బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.