ఎక్సైజ్ స్టేషన్‌లో వాహనాల వేలం

ఎక్సైజ్ స్టేషన్‌లో వాహనాల వేలం

నారాయణపేట పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద వివిధ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలకు మంగళవారం బహిరంగ వేలంపాట నిర్వహించారు. సీఐ అనంతయ్య తెలిపిన వివరాల ప్రకారం, రెండు వాహనాల వేలంలో ఒక వ్యక్తి రూ.68,020 చెల్లించి వాటిని సొంతం చేసుకున్నాడు. మొత్తం 20 మంది పాల్గొన్న ఈ వేలంపాట ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందని తెలిపారు.