పాత తాండూరులోని బావిలో మృతదేహం

పాత తాండూరులోని బావిలో మృతదేహం

RR: బావిలో ఓ యువకుడు మృతదేహం లభ్యమైన సంఘటన తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో వెలుగులోకి వచ్చింది. పాత తాండూరులోని నిజాం షాహీ దర్గా సమీపంలో బావిలో గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు.