నిజరూప దర్శనంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ అమ్మవారు
CTR: పుంగనూరు పట్టణం పాత బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ మంగళవారం సందర్భంగా భక్తులకు నిజరూప దర్శన భాగ్యం కల్పించింది. అర్చకులు మూలవర్లను ఫల పంచామృతలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి, అలంకరించారు. తర్వాత దూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.